మనగుడి మనబడి ట్రస్ట్ చే ఉచిత మెటీరియల్ పంపిణీ…
– బద్దం బోజరెడ్డి చే విద్యార్థులకు అందజేత.
ముధోల్ ఇంటలెక్షవల్ ఫోర0 మనగుడి-మనబడి చైర్మన్ బద్దంభోజ రెడ్డి చే తాలూకా వ్యాప్త పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకి ఉచిత ఆల్ ఇన్ వన్ మెటీరియల్ అందించాలని ఉద్దేశంతో మంగళవారం తన కార్యాలయంలో బైంసా పట్టణానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలకు ఉచిత మెటీరియల్ను అందించారు. రానున్న బోర్డ్ ఎగ్జామ్ కి మంచిగా చదివి అద్భుతమైన స్కోరును సాధించాలని విద్యార్థినీలకు తెలిపారు. ఉచిత మెటీరియల్ అవసరం ఉన్న తాలూకా వ్యాప్త పదవ తరగతి విద్యార్థులు ట్రస్ట్ ఆఫీసుకు వచ్చి మెటీరియర్ ను తీసుకోవాల్సిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.