Tuesday, 3 November 2026

కంటి వెలుగుకు ప్రజల్లో విశేష స్పందన .   క్యాంపును ప్రారంభించిన . సర్పంచ్ లచ్చమ్మ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మ్యాఆనంద్తరి

 

 

 

 

 

కోహిర్ మండలం రాజనెల్లి గ్రామంలోకంటి వెలుగు కార్యక్రమన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మొగుడం పల్లి లచ్చమ్మ, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మ్యాతరి ఆనంద్ లు  అన్నారు. ఆయన బుధవారం  కోహిర్  మండలంలోని  రాజనెల్లి  గ్రామంలో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వేలుగు  క్యాంపు శిబిరాన్ని ప్రారంభించారు.అనంతరం  కంటి పరీక్ష నిర్వహించ విధానాన్ని పరిశీలించి. మొదట కంటి పరీక్షలు చేయించుకున్నారు. తర్వాత కంటి పరీక్షలు నిర్వహించిన వారికి సర్పంచ్ లచ్చమ్మ ,మ్యాతరి ఆనంద్  చేతుల మీదుగా కళ్ళ అద్దాలను పంపించేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు మరే ఏ రాష్ట్రంలో లేవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కంటిచూపు సరిగా లేక కంటి సమస్యలతో ప్రజలు ఎవరు బాధపడకూడదని భావించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు . ప్రజల కష్టాలు తెలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల కోసం ఆరోగ్య రంగంలో ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు అన్నారు.అందులో భాగంగానే గ్రామాలలో కంటి వెలుగు క్యాంపు శిబిరాలను ఏర్పాటు చేసి కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఉచితంగా అద్దాలను సైతం అందిస్తున్నారన్నారు.గర్భిణుల కొరకు పౌష్టికాహారం అందించడంతోపాటు 102 వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి ఇంటికి తీసుకొస్తుంన్నారు.గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు సైతం అందిస్తున్నారన్నారు.ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు మగ పిల్లగాడు పుడితే 12 వేల రూపాయలతో పాటు కేసిఆర్ కిట్ ను సైతం అందిస్తుందని తెలిపారు.ఎవరు కూడా అందుత్వానికి గురికాకూడదని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారన్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటి వెలుగు శిబిరం క్యాంపు వద్ద కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు, ఈ  కంటి క్యాంపుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సంపూర్ణ అంధత్వ నివారణ కొరకు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామాలలో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తుందన్నారు.ఈ పథకము కింద 18 సంవత్సరాల పైబడి ఉన్న వారందరికీ గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని రకాల కంటి సమస్యల కొరకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను ఉచితంగా ఇస్తారన్నారు.కంటి పరీక్షలు నిర్వహించి వారి కంటిచూపు మేరకు వారి కంటే సామర్ధ్యాన్ని బట్టి కంటి అద్దాలను అందించడం జరుగుతుందన్నారు.కంటి పరీక్షలు నిర్వహించిన వారికి కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి సైతం ప్రభుత్వమే ఉచితంగా జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్లు  ప్రభుత్వమే చేయిస్తుందన్నారు.కంటి పరీక్షకు వచ్చిన వారి పేర్లు నమోదు చేసు కోవడంతో పాటు రాని వారి ఇంటంటికి వెళ్లి వారికికంటివెలుగుపై  ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారన్నారు.ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటే వెలుగు క్యాంపును శిబిరాన్ని సద్వినియోగపరుచుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి ఎచ్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు , పంచాయతీ కార్యదర్శి ఆనంద్, గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు రాచన్న,మధుకార్,ఏ ఎం ఎం, ఆశ అంగన్వాడీ టీచర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు*