తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో పేద ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం బొంరస్ పేట మండలంలోని మెట్లకుంట గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా శిబిరంలో కంటి పరీక్షల తీరును పరిశీలించిన అనంతరం అవసరం ఉన్న వారికి కంటి అద్దాలను ఎమ్మెల్యే స్వయంగా అందించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అంధత్వం లేకుండా చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు.
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోలేని పేద ప్రజలకు ఉచితంగా పరీక్షలు,కంటి అద్దాలతోపాటు అవసరం ఉన్న వారికి కంటి శస్త్ర చికిత్సలు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు.
నియోజకవర్గంలోని ప్రజలంతా కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక,మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు




