గద్వాల ప్రతినిధి ఏప్రిల్ 12 (జనంసాక్షి): సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్‌లో భాగంగా ఈనెల 14న మంచిర్యాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జోగుళాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి పిలుపినిచ్చారు. బుధవారం గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ఆయన మాట్లాడారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ ఈనెల 14వ తేదీన మంచిర్యాలలోని ప్రగతిమైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నన్నట్లు తెలిపారు. ఈసభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తదితరులు హాజరవుతున్నారని.. జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




