Wednesday, 4 November 2026

కంటి వెలుగును తనిఖీ చేసిన క్వాలిటీ కంట్రోల్ అధికారిణి డాక్టర్ హిమబిందు

 

టేకులపల్లి, జనవరి 25( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలో సులానగర్, ప్రగళ్లపాడు గ్రామపంచాయతీలలో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కంటి వెలుగు క్వాలిటీ కంట్రోల్ అధికారిణి డాక్టర్ హిమబిందు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కంటి వెలుగు నిర్వహణను పూర్తిగా పరిశీలించి తగు సూచనలు,సలహాలు ఇచ్చారు.18 సంవత్సరాలు దాటిన వారందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని, అవసరమైన వారందరికీ కళ్లద్దాలు, మందులు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందత్వాన్ని రూపుమాపటం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ దినేష్, కంటి వెలుగు వైద్యాధికారులు డాక్టర్ శ్రావణి, డాక్టర్ పావని, ఆప్తాలిమిక్ ఆఫీసర్ లు సనత్ కుమార్,ఫాతిమా, దివ్య, సతీష్,సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్,వీసం శకుంతల,కార్యదర్శులు లక్ష్మీనారాయణ,పవిత్ర, ఏఎన్ఎం లు లలిత, కళావతి, అనసూయ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.