Wednesday, 4 November 2026

ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేయాలి.

-డి పి ఆర్ ఓ సీతారాం నాయక్.
-“వుదయం”క్యాలెండర్ ఆవిష్కరణ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి25(జనంసాక్షి): జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని డిపిఆర్ఓ సీతారాం నాయక్ అన్నారు.బుధవారం డిపిఆర్ఓ కార్యాలయంలో వుదయం దినపత్రిక 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డిపిఆర్ఓ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలను మానవీయ కోణంలో ఆవిష్కరించడంలో వుదయం దినపత్రిక ముందుందని అన్నారు.మానవీయ కోణంలో కథనాలను అందించడం ద్వారా ప్రభుత్వ పరంగా బాధితులందరికీ సహాయం అందేలా తోడ్పాటు అందిస్తుంద ని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో జర్నలిస్టులు పనిచేయాల్సి ఉందని అన్నారు.వుదయం దినపత్రిక జిల్లా ప్రతినిధి మలిపెద్ది రమేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను కథనాలుగా మలిచి అందించడంలో వుదయం దినపత్రిక పాత్రికేయులు ముందు వరుసలో ఉన్నారని అన్నారు.అనంతరం డిపిఆర్ఓ ను శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్టులు కొండకింది మాధవరెడ్డి,సందు యాదగిరి, మల్లేష్,డిపిఆర్ఓ కార్యాలయ సిబ్బంది అహ్మద్ పాషా, వెంకటయ్య,లక్ష్మణ్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.