Thursday, 5 November 2026

కంటి వెలుగును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి

.. బచ్చన్నపేట సర్పంచ్. వడ్డేపల్లి మల్లారెడ్డి
బచ్చన్నపేట జనవరి 17 (జనం సాక్షి) కంటి వెలుగు కార్యక్రమం ప్రజలందరికీ ఎంతో అవసరమని బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కంటి వెలుగు ప్రోగ్రాం ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మండలంలో ప్రతి గ్రామపంచాయతీ ముందు రేషన్ షాపుల ముందు గ్రామాల్లోని ప్రధాన కూడలిలో ప్రచారం కోసం బ్యానర్లు కట్టడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు. అంగన్వాడి టీచర్లు. ఏఎన్ఎం లకు మరియు పంచాయతీ కార్యదర్శులకు సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు అందరికీ అవగాహన సదస్సులు పెట్టి ప్రజలందరికీ తెలిసే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు ఇలాంటి కంటి వెలుగు ప్రోగ్రాం దేశంలో ఎక్కడా లేదని మళ్లీ ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని వారు అన్నారు