:
సర్పంచ్ నీల కుమారస్వామి వైస్ ఎంపీపీ లత
వీణవంక జనవరి19
( జనం సాక్షి): వీణవంక అంధత్వంతో ఏ ఒక్కరు బాధపడొద్దనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి వైస్ ఎంపీపీ లత కోరారు. గురువారం వీణవంక మండల కేంద్రంలో స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ వరుణ ఉచిత కంటి శిబిరాలలో ఉచితంగానే కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని వివరించారు. ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు . అవసరమైన వారికి కంటి వెలుగును ప్రసాధిస్తున్న గొప్ప వ్యక్తి కెసిఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కంటి పరీక్షలకు అందరు వచ్చే విధంగ చూడాలని చెప్పారు
కంటి వెలుగు వైద్య శిబిరానికి18 సంత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు పాల్గోనేలా, ఎవరికి ఎలాంటి కంటి సమస్యలు ఉన్నా అత్యున్నత ప్రమాణాలతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ళఅద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీల కుమారస్వామి వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత వైద్యురాలు డాక్టర్ వర్ణ ఉప సర్పంచ్ భానుచందర్ వార్డ్ మెంబర్లు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగును ప్రసాదిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్




