టేకులపల్లి, జనవరి 19( జనం సాక్షి ): టేకులపల్లి మండలం బేతంపూడి దర్గా దగ్గర మూడు రోజులు జరిగే ఉరుసు షరీఫ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు గురువారం పాల్గొని ప్రత్యేక పాతెహా( పూజలు)చేశారు. ఈ సందర్భంగా ముస్లిం, పూజారులను, సోదరులను కలిసి ఉరుసు షరీఫ్ మూడు రోజుల ప్రత్యేకత, విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జానీ, షకీల్ , ఆశిల్, కాజా, తాజు , స్వామి, శ్రీను స్వామి, షఫీ, జాటోత్ నరేష్ నాయక్, అంతోటి రాకేష్, కాలే అభినయ్ తదితరులు పాల్గొన్నారు.




