Tuesday, 3 November 2026

కంటి వెలుగులో కంటి ఆపరేషన్లు కూడా చేయాలి

 

 

 

 

 

కంటి వెలుగులో కంటి ఆపరేషన్లు కూడా చేయాలి* పి వై ఎల్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల డిమాండ్
టేకులపల్లి, జనవరి 30 (జనం సాక్షి): మండలంలోని ముత్యాలంపాడు రైతు వేదిక లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పి వై ఎల్ నాయకులు సోమవారం పరిశీలించారు. పి వై ఎల్  కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల భానుచందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షల అనంతరం కంటి పొరలు తొలగించే  ఆపరేషన్ ను కూడా  ప్రభుత్వం వెంటనే చేపించాలని, అందుబాటులో లేని కళ్లద్దాలను  ఆర్డర్ చేసి కంటి అద్దాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం ను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి తొటకూరి సతీష్, మండల నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.