Tuesday, 3 November 2026

సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్న న్యూడెమోక్రసీ నాయకులు

 

 

 

 

 

 

సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్న న్యూడెమోక్రసీ నాయకులు
ఖమ్మం .తిరుమలాయపాలెం (జనవరి 30) జనం సాక్షి. బచ్చోడు, తిరుమలాయపాలెం ఏ ఈ శంకర్,రవికుమర్ లకు వినతి పత్రాలు ఇస్తున్న న్యూడెమోక్రసీ నాయకులుఅదనపు విద్యుత్ చార్జీలను ఏసీడి బిల్లును వసూలు చేయటాన్ని మరియు రైతంగానికి 24 గంటల కరెంటును ఇస్తా అని ఇవ్వకుండా కటింగ్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బచ్చోడు మరియు తిప్పారెడ్డిగూడెం సబ్ స్టేషన్ లో ధర్నా నిర్వహించటం జరిగింది. అనంతరం బచ్చోడు ఏఈ శంకర్,తిరుమలయపాలెం      ఏ ఈ రవికుమార్ లకు వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ సి డి అదనపు చార్జీల బిల్లులతో పేద ప్రజల పైన మధ్యతరగతి ప్రజల పైన ఈ అదనపు బిల్లు భారంగా పడిందని దీనివలన ప్రజలకు చాలా నష్టం జరుగుతుందని రోజువారిగా పని చేసుకుంటేనే పూట గడవని పరిస్థితులలో అదనపు చార్జీల పేరుతో వసూలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదని తక్షణమే ఏసీడీ బిల్లును ఉపసంహరించుకోవాలని  ప్రభుత్వాన్ని కోరారు .ఎస్సీలకు 100 నుంచి 150 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదని పైగా ఎసిడి పేరుతో అడ్వాన్సుగా వసూలు చేయటం సరైనటువంటి పద్ధతి కాదని అదేవిధంగా రైతాంగానికి ఉచిత 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం గత వారం పది రోజులుగా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితులలో ప్రభుత్వ అధికారులకే తెలియడం లేదని రైతంగం మొత్తం కూడా ఆందోళనకు గురికావడం జరుగుతుంది రైతే రాజు అని చెప్పుకుంటూ వస్తున్న ఈ ప్రభుత్వాలు రైతుల పట్ల చిన్న చూపు చూస్తూ మోసం చేస్తుందని రైతులకు తక్షణమే 24 గంటల కరెంటును కటింగ్ చేయటాన్ని మానుకోవాలని అన్నారు .ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మండల నాయకులు చారి,వీరస్వామి, అచ్ఛా ఉప్పలయ్యా ,నాగయ్య, శబ్బీర్, శ్రీకాంత్,నగేష్ శ్రీను విద్యా కమిటీ చైర్మన్ రామకృష్ణ,వీరస్వామి, సంజీవ, వెంకన్న,సురేష్, తదితరులు పాల్గొన్నారు.