కంటి వెలుగు ఏర్పాట్లను పరిశీలించిన కంటి వెలుగు ఇన్చార్జి ఆఫీసర్ డాక్టర్ స్రవంతి
మల్దకల్ జనవరి 13 (జనం సాక్షి)మండలంలోని నీలిపల్లి, మల్దకల్ గ్రామాలలోకంటి వెలుగుఅంధత్వ నివారణ కోసముఈ నెల18నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతము చేయాలని జిల్లా కంటి వెలుగు ఇన్చార్జి డాక్టర్ స్రవంతి అన్నారు.ఈ నెల 18 నుంచి 100 రోజులపాటు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం శుక్రవారం ఏర్పాట్లను పరిశిలి౦చారు.ప్రతి గ్రామపంచాయతీలో ప్రజలందరూ పాల్గొనేలా విస్తృత ప్రచారం చేసి అందర్నీ భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమము కోసము ప్రతి గ్రామ పంచాయతీలోఅన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కుర్చీలు టేబుల్స్ అన్ని సిద్ధం చేయాలని ఆమె సర్పంచులకు సూచించారు. మండలంలోని రెండు గ్రామాలలో కంటి వెలుగు ప్రోగ్రాంప్రారంభమవుతుందన్నారు.ఆఫీసర్ వెంట సి హెచ్ ఓ వెంకటస్వామి,నీలిపల్లి సర్పంచ్ ప్రకాష్ ,ఆశా వర్కర్లు,పరిమళ పంచాయతి కార్యదర్శి మాబి పాల్గొన్నారు.




