జాతిపితకు క్షీరాభిషేకం
– పుర చైర్మన్ వీరన్న
డోర్నకల్ జనవరి 13 జనం సాక్షి
మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీలపై వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్,ఎమ్మెల్యే రెడ్యానాయక్ చిత్రపటానికి డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న పాలకవర్గంతో కలిసి క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత కెసిఆర్ తమ మున్సిపాలిటీ అభివృద్ధికి 25 కోట్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు.నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా బహిరంగ సభలో జిల్లాలోని గ్రామాలకు,నాలుగు మునిసిపాలిటీలకు వరాల జల్లు కురిపించినట్లు తెలిపారు.తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు.రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.సీఎం ప్రత్యేక నిధి నుంచి కేటాయించిన రూ.25 కోట్లతో మున్సిపాలిటీని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ కోటిలింగం,ఫ్లోర్ లీడర్ సురేందర్ జైన్,పోటు జనార్ధన్,అశోక్,పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్,కో ఆప్షన్ సభ్యులు రామభద్రం,మియా,నాయకులు న్యాయవాది రమేష్,కొత్త వీరన్న,మైనార్టీ అధ్యక్షుడు గౌస్ పాషా,సలీం,
ఏపూరి వెంకటేశ్వర్లు,గాయకుడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.




