Thursday, 5 November 2026

 కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం   జనంసాక్షి న్యూస్ జనవరి21 /22.యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం   జనంసాక్షి న్యూస్ జనవరి21 /22.

ఫోటో రేట్ అఫ్ 01తుర్కపల్లి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తున్న దృశ్యం
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్,జెడ్పి వైస్ చైర్మన్ బిక్కు నాయక్ లు కోరారు. శనివారం తుర్కపల్లి మండలం బాబుల బాబులా నాయక్ తండాలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకుని అద్దాలు, మందులు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ జి శ్యాంసుందర్, ఎంపీడీవో మానే ఉమాదేవి, సర్పంచ్ మాలోతు రమేష్ నాయక్, ఎంపీటీసీ ధనావత్ మోహన్ బాబు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ నర్సింలు,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ రెడ్డి,బానోతు భాస్కర్ నాయక్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.