Thursday, 5 November 2026

సమస్యలు పరిష్కరించకుండా అరెస్టులా

…
* టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్

టేకులపల్లి,జనవరి 22( జనం సాక్షి): హైదరాబాదులో ప్రగతి భవన్ ముందు (నేడు)ఆదివారం జీవో 317 బాధిత స్పౌజ్ ఉపాధ్యాయులు ముట్టడి కార్యక్రమం చేస్తున్నారనే కారణంగా శనివారం సాయంత్రం టి.పి.టి.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.హరిలాల్ నాయక్ ను టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ లో నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య భారత దేశంలో ఉపాధ్యాయుల సంక్షేమం,ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం పాటుపడుతున్న తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సంఘ నాయకులను అరెస్టు చేయడం సబబేనా అని విమర్శించారు. ఈ విధంగా అరెస్టులతో ఉద్యమాలని ఆపగలరా!ఆపితే ఎంతకాలం ఆపగలరు అని సూటిగా ప్రశ్నించారు .ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి,ఉపాధ్యాయులు ప్రశ్నించకుండా వారి యొక్క గొంతు నొక్కడం ప్రజాస్వామ్యంలో సరైనదేనా? శనివారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ కార్యాలయం ముందు వారి సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలియజేసిన స్పౌజ్ ఉపాధ్యాయులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆకస్మికంగా ఉపాధ్యాయులకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఆగమేఘాల మీద నిర్వహించిన జీవో 317 బదిలీలలో భార్యాభర్తలు విడిపోయి చెరో జిల్లాలలో పనిచేస్తూ మానసికంగా కృంగిపోతున్నారని అన్నారు. ఈ సమస్యలపై ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన, ప్రభుత్వం వారి సమస్యలను బదిలీల ముందైనా పరిష్కరించకుండా బాధ్యతారాహిత్యంగా, ఉపాధ్యాయులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడం సరైనది కాదుఅని అన్నారు. బదిలీలు, పదోన్నతులు చేపట్టే ముందు టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వం దృష్టికి మెమోరాండం రూపంలో తీసుకువెళ్లిన ప్రాతినిధ్యాన్ని పరిశీలించి