హుజూర్ నగర్ జనవరి 20 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంను
హుజూర్ నగర్ పట్టణంలోని 4వ వార్డ్ లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎండీ నిరంజన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాల యందు వైద్యులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన లబ్ది దారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత, క్యాంపు సూపర్వైజర్ ఇందిరాల రామకృష్ణ, డాక్టర్ సుష్మ , విజయలక్ష్మి, మల్లిక, శివ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ




