కుటుంబానికి 25లక్షల చెక్ అందజేసిన కమీషనర్ స్టీఫె న్ రవీంద్ర :శామీర్ పేట్, జనంసాక్షి :
గత 2 సంవత్సరాలుగా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న షరీఫ్ డిసెంబర్ 9న తెల్లవారుజామున ఉదయం 05:30 గంటల సమయంలో శామీర్ పేట్ పి.యస్ పరిధిలో పెట్రోలింగ్ విధులలో ఉండగా ఒక కారు ఢీ కొట్టగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర రక్తగాయలై యశోద ఆసుపత్రి(సికింద్రాబాద్) లో చికిత్స పొందుతూ 10 తేదీన చనిపోయారు. నిరుపేద కుటుంబం నుండి కానిస్టేబుల్ స్థాయికి ఎదిగి, తన కుటుంబం మొత్తంను తన జీతంతో పోషిస్తున్న షరీఫ్ ను మృత్యువు కబలించడం చాలా చాలా బాధాకరం. ఇట్టి హృదయ విదారక సంఘటనకు చలించి, శామీర్ పేట్ సి.ఐ సుధీర్ కుమార్ ప్రోత్సాహంతో శామీర్ పేట్ పి.యస్ సిబ్బంది, పేట్ బషీరాబాద్ డివిజన్ పోలీస్ సిబ్బంది మరియు ఇతర దాతల సహకారంతో 25 లక్షల రూపాయలు సేకరించి, అట్టి రూపాయలకు సంబందించి 25 లక్షల రూపాయల చెక్కును శుక్రవారం రోజు బాలానగర్ డి.సి.పి కార్యాలయంలో సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా షరీఫ్ తల్లిదండ్రులు, భార్యకు అందజేశారు . ఈ కార్యక్రమంలో బాలానగర్ డి.సి.పి సందీప్ , ఏసిపి రామలింగరాజు, శామీర్ పేట్ ఇన్స్ పెక్టర్ సుధీర్ కుమార్, ఎస్సైలు వీరశేఖర్,రవికుమార్,మునీందర్,చంద్రశేఖర్,అనిత మరియు ఇతర పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
20ఎస్పీటీ -1: బాధిత కుటుంబానికి చెక్ అందజేస్తున్న దృశ్యం
రోడ్ ప్రమాదంలో మృతి చెందిన పోలీస్ షరీఫ్




