Thursday, 5 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్

 

జనం సాక్షి/ కొల్చారం
రెండో విడత కంటి వెలుగు రాణి సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొల్చారం మండలం సీతారాం తండాలో ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఆ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అధికారులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీతారంతాండాలో నిన్న, ఈరోజు కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిన్న ప్రారంభ రోజైనందున వంద మందికి కంటి పరీక్షలు చేయడం జరిగిందని, ఈరోజు 400 మందికి కంటిపరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. మొత్తం పదిమంది సిబ్బంది ఉన్నట్లు, వాళ్లందరికీ వసతి తో పాటు భోజన సౌకర్యం గ్రామపంచాయతీ ద్వారా కల్పించడం జరిగింది అన్నారు. ఇక్కడి టీం రేపు మరో గ్రామానికి షిఫ్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఆమె వెంట స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఎంపీడీవో గణేష్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రమేష్, ఎంపీ ఓ కృష్ణవేణి పంచాయతీ కార్యదర్శి సదాశివ, ఐకెపి సిసి వెంకటేశం, వైద్య సిబ్బంది ఉన్నారు.