Wednesday, 4 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం

 

 

 

 

 

చేసుకోవాలి-ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవినాయక్.ప్రతి ఇంటి వెలుగు కంటి వెలుగు.కురవి మార్చి/6/జనం సాక్షి న్యూస్: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గూగుల్ పద్మావతి రవి నాయక్ అన్నారు. సోమవారం కురవి మండలం నారాయణపురం గ్రామం లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి అనంతరం ఆమె మాట్లాడుతూ కంటి శుక్లాలు , కంటి చూపు మందగించిన వారందరికి ఉచిత కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని,శస్త్ర చికిత్స కొరకు పంపడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లూరి విజయ వాసురాజు, ఎంపీటీసీ ధరావత్ అర్జున్ ,వైద్యాదికారి డాక్టర్ అశోక్ కుమార్, ఉప సర్పంచ్ ధరావత్ భాస్కర్ , మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మెంబర్ భరధ్వాజ్ రెడ్డి,గ్రామ పంచాయతీ కార్యదర్శి మవీన్ , వార్డు సభ్యులు , ఆప్తమాలజిస్ట్ పూర్ణ చందర్, డీయివో కౌసర్ ,సౌమ్య ,హెల్త్ అసిస్టెంట్లు అనీల్ కుమార్ ,హేమలత, అరుణా దేవీ , జ్యోతి , అంగన్వాడీ టీచర్లు సునీత , విజయ లక్ష్మి , ఆశా కార్యకర్తలు పూరి , కవిత , కృష్ణవేణీ , పద్మ , గ్రామ పెద్దలు భద్రయ్య , వీరభద్ర రాజు , రూప్ సింగ్ ,రవి , కిషన్, బాలియా, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.