టేకులపల్లి, మార్చి 6( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డివిజన్లోని కొమరారం, బోడు మండలాలుగానూతనంగా ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం బోడులోబహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభకు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఎట్టి నరసింహారావు అధ్యక్షత వహించగా, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిలో బంగారు తెలంగాణగా ఏర్పాటు చేస్తామని మాటలు గారడి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివాసి గిరిజల్ల పరిపాలన సౌలభ్యం కోసం మండలాలుగా ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజానీకం మొత్తం రాజకీయాలకతీతంగా అందరూ విజ్ఞప్తులు చేస్తూ కోరుతూ ఉంటే ఆదివాసి గిరిజనుల పట్ల కపట ప్రేమలు చూపిస్తూ మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలైన కొమరారం, బోడు గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక, విద్య, వైద్యం, రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటుతనంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చాక కేసీఆర్ గారడి మాటలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పరిపాలన సౌలభ్యం కోసం, అధికార యంత్రాంగమంతా ఆదివాసి గిరిజనులకు అందుబాటులో ఉంటారని ప్రత్యేకంగా కొమరారం, బోడు గ్రామాలను మండలాలుగా గుర్తించి ఏర్పాటు చేయాలని ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షను తీర్చలేని ప్రభుత్వాలు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని, ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రత్యేక మండలాలను ఏర్పాటు చేయాలని మూడు రోజుల నుండి కొమరారం నుండి పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా బోడు గ్రామానికి చేరుకొని బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు రాజకీయాలకతీతంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్ర




