హుజూర్ నగర్ మార్చి 24 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అందత్వ నిర్మూలనే లక్ష్యంగా కెసిఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని , కంటివెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని లక్కారం గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ సౌజన్య నరేష్ లతో కలిసి ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఊరూరా పల్లె, పట్నం అనే తేడా లేకుండా కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ఎంపిటిసి రణపంగు కాశమ్మ , గ్రామ కార్యదర్శి నరాల కపిల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




