Wednesday, 4 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 

 

 

 

 

 

 

వేమనపల్లి,ఏప్రిల్ 11,(జనంసాక్షి):కేతనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండోదఫా కంటివెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ ఆవులమారి దుర్గక్క,క్యాంపు మెడికల్ ఆఫీసర్ వారిస్ పటాన్ లు ప్రారంభించారు.ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని రూపొందించారని అన్నారు.ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి,కళ్లఅద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు,మందులను అందజేస్తుందని అన్నారు.18 ఏళ్లు పైబడిన ప్రతీఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామన్న,పంచాయతీ కార్యదర్శి జాఫర్ అలీ,కంటి పరీక్ష నిపుణులు చైతన్య ప్రసాద్,హెల్త్ అసిస్టెంట్ బాపు,ఏఎన్ఎం విజయ లక్ష్మి,ఉమాదేవి,డేటా ఎంట్రీ ఆపరేటర్ జవేద్,అంగన్వాడీ టీచర్ మానస,ఆశ కార్యకర్తలు పాల్గోన్నారు.