అచ్చంపేట ఆర్సీ,11 ఏప్రిల్ 2023,జనంసాక్షి న్యూస్ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఉత్సవాలు నిర్వహించారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పాండు జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడుతూ..మహాత్మ జ్యోతిరావు పూలే సంఘసంస్కర్త గా అసమానతలు రూపుమాపేందుకు చాలా కృషి చేసారని, పేదలకు చదువును అందిచారని అన్నారు.ఫూలే ఆశయాలను,కొనసాగించాలని కోరారు.కార్యక్రమంలో తహశీల్దార్ రాములు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




