హుజూర్ నగర్ మార్చి 1 (జనంసాక్షి): కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి స్పష్టమైన కంటిచూపు అందించాలని ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ కోరారు. బుధవారం పట్టణంలోని 11 వార్డు నందు నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో కస్తాల శ్రావణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి మండల పరిధిలో కంటి ఆపరేషన్ శిబిరాలను ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు మరింత మేలు కలుగుతుందని, ప్రస్తుతం ఆపరేషన్లు అవసరమైనటువంటి వారు జిల్లా కేంద్ర ఆస్పత్రులకు వెళ్ళవలసి వస్తున్నందున వృద్ధులు, పేదవారు మరింత ఇక్కట్ల పాలు కావాల్సి వస్తుందని, ప్రభుత్వం కంటి ఆపరేషన్ అవసరమైనటువంటి వారికి తక్షణమే కంటి శస్త్ర చికిత్స శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోమాజీ జడ్పిటిసి గళ్ళా వెంకటి, మున్సిపల్ కౌన్సిలర్లు సరితవీరారెడ్డి, రాజా, విజయవెంకటేశ్వర్లు, క్యాంపు సూపర్వైజర్ ఇందిరాల రామకృష్ణ, డాక్టర్ సుష్మ, మల్లిక, శివ, వార్డు ప్రజలు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి – కంటి వెలుగు శస్త్ర చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలి – కస్తాల శ్రావణ్ కుమార్




