Monday, 2 November 2026

స్టెమ్ ల్యాబ్ ప్రారంభోత్సవ శిలాఫలకంపై భువనగిరి పార్లమెంట్ సభ్యుని పేరు పెట్టకుండా అగౌరవ పరిచి ప్రోటోకాల్ పాటించని  అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి…

బర్రె జహంగీర్( బి జె ఆర్)           జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు యువజన కాంగ్రెస్ ధర్న..— మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్ భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
నిన్న భువనగిరి మండలం అనంతరం గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో స్టెమ్ ల్యాబ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్ గారిచే ప్రారంభించబడిన ప్రారంభోత్సవ శిలాఫల్కం పైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు పెట్టకుండా అగర్వపరిచి, ప్రోటోకాల్ పాటించని జిల్లా అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మూడు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా స్టెమ్ ల్యాబ్ ను మొట్టమొదటిగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామం ప్రారంభించిన ల్యాబ్ కు సంబంధించి ప్రారంభోత్సవ శిలాఫలకం పైన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు పెట్టకుండా భువనగిరి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ భువనగిరి మండలం అనంతరం గ్రామంలో జరిగే కార్యక్రమంలో నే ఎంపీ గారికి ఈ విధంగా అగౌరవ పరిస్తే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలారా గమనించండి టిఆర్ఎస్ పాలకపక్షం సంబంధించిన వార్డు మెంబర్ స్థాయి నుండి ప్రారంభోత్సవ శిలాఫలకంలో పేర్లు ఉంటాయి గాని పార్లమెంట్ సభ్యుడు పేరు ఏ విధంగా ఉండదు ఇది అధికారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ కక్షపూరితంగా పార్లమెంట్ సభ్యుని పేరు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇటువంటి చర్యలు గతంలో కూడా అనేకమార్లు జరిగినాయి పలుమార్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చిన కూడా మేడం గారు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భువనగిరి శాసనసభ్యునికి కొమ్ముకాస్తూ అతను చెప్పినట్లుగా జిల్లా కలెక్టర్ గారు ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు మహిళలకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా శిలాఫలకాలకు సంబంధించిన వాటిపైన పేర్లు పెట్టకపోయినా అధికారపరమైన సమావేశాలు జరుగుతున్నా కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతిని వేదికల పైకి పిలవకపోయినా జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లా ప్రజలకు పార్టీలకు అతీతం,గా కులాలకు అతీతంగా, ప్రజలందరినీ సమానంగా చూడవలసిన అధికారులే కక్షపూరితంగా అధికార పార్టీ కొమ్ము కాస్తూ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యునికి ఈ విధంగా అగర్వపరిస్తే సామాన్య పేద ప్రజలకు ఏ విధమైన న్యాయం జరుగుతుందో ప్రజలారా ఆలోచించండి అని అన్నారు వెంటనే అనంతరం గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో శిలాఫలకం పైన  పార్లమెంట్ సభ్యుడు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు పెట్టాలని లేనియెడల అంచలవారిగా ఆందోళన చేస్తామని అన్నారు ఈకార్యక్రమంలో 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట గిరీష్ కుమార్ గౌడ్ ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షులు దండు నరేష్ యువజన కాంగ్రెస్ పట్టణ నాయకులు పోత్నక్ సత్య శివప్రసాద్ పట్నం ప్రణీత్ ఐలాపురం బాబు పిట్టల వెంకటేష్ బట్టు మహేందర్ ఎర్ర మహేష్ పల్లె పార్టీ నరసింహ నవీన్ తదితరులు పాల్గొనడం జరిగింది.