Tuesday, 3 November 2026

కంటి వెలుగు పధకంతో పేదలకు మేలు

 

 

 

 

 

 

: తుంకుంట 3వార్డు కౌన్సిలర్ రజినివేణు గోపాల్ రెడ్డి : శామీర్ పేట్ జనం సాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు పేద లకు జీవన వెలుగు లాంటి దని తుంకుంట మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ రజిని వేణు గోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయ పల్లిలో కంటి వెలుగు కార్యక్రమం ను వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంధత్వంతో ఏ ఒకరూ బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈగొప్ప కార్యక్రమం చేపట్టారని తెలిపారు.రెండో విడుతలో జూన్ 30వ తేదీవరకు నిర్వహించే కంటి వెలుగు శిబిరాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఉచితంగా అందజేస్తారన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ రజిని వేణుగోపాల్ రెడ్డి,డాక్టర్ రాజశేఖర్, పి ఎం ఓ పరమేశ్వరి, ఆశ వర్కర్లు నర్మధ, లత, భవాని, మాధవి, నాయకులు భూపాల్ రెడ్డి, సూపర్ వైజర్ నాని,తదితరులు పాల్గొన్నారు.
1ఎస్పీటీ -1: కంటి వెలుగు ను ప్రారంభిస్తున్న వేణుగోపాల్ రెడ్డి