Tuesday, 3 November 2026

పత్తికి కనీస మద్దతు ధర రూ.15,000 ఇవ్వాలి

 

 

 

 

 

 

 

– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాడి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ జనం సాక్షి, మంథని: పత్తి రైతులు అరుకాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర 15 వేల రూపాయలు ఇవ్వాలని మాదాడి శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మంథని నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ మాదాడి శ్రీనివాస్ రెడ్డి సమావేశము నిర్వహించారు. అరుకాలము పండించిన పంట పంట చేతికచేసరికి ధరల్లో హెచ్చుతగ్గులతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో అధిక వర్షా భావంతో పంటలు దిగుబడిరక, కూలి ఎక్కువ ఇచ్చి పత్తి పంటను రైతు ఇంటికి తెచ్చి అమ్మకానికి తీసుకెళ్తే రోజు రోజు కు ధరను దళారులు తగ్గిస్తూ రైతులను ధగచేస్తున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరేతనట్టు చోద్యం చూస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సీసీఐ ని రంగంలోకి దించి రైతులకు క్వింటాలు కు 15 వేలు వెచ్చించి కోనుగోలు చేసేవిధంగా ఈ ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర కల్పిస్తూ పత్తి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే వరకు టిడిపి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో కార్యక్రమంలో
పెద్దపల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండె రాజయ్య , రాష్ట్ర మహిళా నాయకురాలు మెండే లక్ష్మి , మంథని మండల పార్టీ అధ్యక్షులు మేదరవైన ఓదెలు, మహ ముత్తారం మండల పార్టీ అధ్యక్షులు అందే భాస్కరాచారి, మంథని ముత్తారం పార్టీ అధ్యక్షులు రాజ్ మహమ్మద్, మహాదేవపూర్ మండల పార్టీ అధ్యక్షులు వీరమల్ల రాజబాబు, కాటారం మండల పార్టీ అధ్యక్షులు చీర్ల మల్లారెడ్డి, జిల్లా యువత నాయకులు బడుగు మహేష్ తదితరులు పాల్గొన్నారు.