కంటి వెలుగు పై మెట్పల్లి మున్సిపల్ లో సమీక్ష సమావేశం
పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
మెట్పల్లి టౌన్, జనవరి 11,
జనంసాక్షి :
మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18 తేదీ నుండి వంద రోజులపాటు జరగనున్న సందర్భంగా దీని పై సమీక్ష సమావేశం మున్సిపల్ చైర్మన్ రాణవేణి సుజాత సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు , ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుండి 100 రోజులపాటు కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుందని నిరుపేదల కోసం సీఎం కెసిఆర్ ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలనే ఉద్దేశ్యంతో కంటి వెలుగు కార్యక్రమం తీసుకురావడం జరిగిందని.
ఎవరికైనా పేదవారికి అవసరం ఆపరేషన్ ఉన్నచో ప్రభుత్వము ఆపరేషన్ చేయించడం జరుగుతుందని, అలాగే
అవసరమున్న వారికి అద్దాలు, మందులు ఇవ్వడం జరుగుతుందని, దీన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, దీనిని అన్ని వార్డుల పరంగా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆర్పీలు అధికారులు ప్రజలకు అవగాహన చేసి వారికి
ఈ కంటి వెలుగు అందే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రానా వేణి సుజాత సత్యనారాయణ,వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు,ఇంచార్జ్ కమిషనర్ రాజ్ కుమార్, ప్రభుత్వ డాక్టర్లు,కౌన్సిలర్లు,కోఆప్షన్స్, ఆర్పీలు,అధికారులు,కంటి వెలుగు అధికారులు, మున్సిపల్ అధికారుల,నాయకులు తదితరులు పాల్గొన్నారు
కంటి వెలుగు పై మెట్పల్లి మున్సిపల్ లో సమీక్ష సమావేశం




