Thursday, 5 November 2026

న్యాయవాదుల దీక్షకు బహుజన జే ఏ సి సంఘీభావం

న్యాయవాదుల దీక్షకు బహుజన జే ఏ సి సంఘీభావం
ఖమ్మం అర్బన్, జనవరి 11 (జనంసాక్షి) ఇటీవల ఖమ్మం నగరంలో న్యాయవాద దంపతులపై జరిగిన దాడిని నిరసిస్తూ వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కోర్టు ఆవరణలో దీక్ష చేస్తున్న న్యాయవాదుల కు బహుజన _ జే ఏ సి నాయకులు బుదవారం సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా బహుజన జెఏసి రాష్ట్ర చైర్మన్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన జే ఏ సి జిల్లా చైర్మన్ దేశ బోయిన సంపత్ కుమార్, జిల్లా కన్వీనర్ దుంపటి సందీప్, నాయకులు లింగస్వామి, మదాసి, టిల్లు, హర్షవర్ధన్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.