గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (25): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం మండల వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ పరిశీలించారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన వారి వివరాలు నమోదు పరీక్షల నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు కంటి పరీక్ష చేయించుకోవడానికి ఎక్కువ మంది హాజరయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు మనుషులకు కళ్ళు ఎంతో కీలకం అన్నారు కంటి పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులను, కళ్లద్దాలను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు వసతులు కల్పించాలని మండల అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హుస్సేనప్ప, కంటి వెలుగు కార్యక్రమం మండల ప్రత్యేక అధికారి వెంకటరమణ, డాక్టర్ కృష్ణకుమారి, సురేష్ కుమార్, ఏపిఎం సావిత్రి,ఆశా వర్కర్లు, అంగన్ వాడి టీచర్లు, పంచాయతీ కార్యదర్శి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు




