నల్గొండ బ్యూరో, జనం సాక్షి.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు.శుక్రవారం నల్గొండ పట్టణం బొట్టు గూడ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరము ఆయన సందర్శించారు.18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నందున కంటి సమస్యలు ఉన్న వారందరూ శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారుకంటి చూపుకు సరిపోయే రీడింగ్ అద్దాలను అప్పటికప్పుడే ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రీస్క్రిప్షన్ అద్దాలను కూడా అంద చేయడం జరుగుతుందని అన్నారు. కంటి పరీక్షల కోసం వచ్చిన ప్రజలతో క్యాంపు ఏర్పాటు,నిర్వహణ,కంటి వెలుగు పరీక్షల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేసుకున్న వారు క్యాంపు నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కొండల్ రావు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి




