జనంసాక్షి కథనానికి స్పందన అక్రమ మడిగే నిర్మాణం కూల్చివేత జేసీబీ తో గోడలు,పిల్లర్ల ను ధ్వంసం చేసిన గ్రామపంచాయతీ అధికారులు మండలంలో పర్మిషన్ లేకుండా గృహ నిర్మాణాలు చేస్తే చట్టప్రకారం చర్యలు భీమ్గల్(జనంసాక్షి):మండలంలోని బాబాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో భీమ్గల్ నుండి కమ్మర్పల్లి వెళ్లే ప్రధాన రహదారి అనుకుని అక్రమ మడిగే నిర్మాణం జరుగుతుంది. గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణంపై శనివారం నాడు జనంసాక్షి దినపత్రికలో బాబాపూర్ గ్రామంలో అక్రమ మడిగే నిర్మాణం, పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు అనే వార్త ప్రచురితం అయ్యింది.ఈ వార్త కు జిల్లా అధికారులు స్పందించారు.జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆర్ముర్ డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు.నిర్మాణానికి గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతి లేకుండా పనులు జరగడంతో డిఎల్పీఓ శ్రీనివాస్ మండిపడ్డారు. వెంటనే జేసిబి తో అక్రమంగా నిర్మిస్తున్న మడిగే ను కూలగొట్టడం జరిగింది. గోడలను,పిల్లర్ల ను మొత్తం ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా డిఎల్పీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామపంచాయతీ పరిధిలో నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ నుండి అన్ని అనుమతులు తీసుకుని గృహ నిర్మాణాలు చేపట్టాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
కథనానికి స్పందన అక్రమ మడిగే నిర్మాణం




