108 లో ప్రసవం
-సిపీఆర్ తో శిశువును రక్షించిన సిబ్బంది
నెన్నెల, డిసెంబర్ 17, (జనంసాక్షి )
నెన్నెల 108 అంబులెన్స్ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. ఓ గర్బిణికి అత్యవసరంగా వాహనంలొినె పురుడు పోశారు. స్పందన లేని శిశువుకు సీపీఅర్ చేసి ప్రాణాలు కాపాడి ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అసిఫాబాద్ జిల్లా చింతల మానెపల్లికి చెందిన కుమ్మరి పద్మకు శనివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను కాగజ్నగర్ ప్రభుత్వ అసుపత్రికి తీసుకవచ్చారు. పరీక్షించిన వైద్యులు కాన్పు కష్టమని మెరుగైన వైద్యం జోసం మంచిర్యాల పెద్దాసుపత్రికి తరలించాలని సిఫారసు చేశారు. కాగజ్నగర్ కు చెందిన 108 అంబులెన్స్ లో బెల్లంపల్లి వరకు తీసుకొచ్చారు. బెల్లంపల్లి లో నెన్నెల 108 వాహనంలోకి షిఫ్ట్ చేశారు. అప్పటికే పద్మ పురుటి నొప్పులతో తల్లడిల్లు తోంది అసుపత్రికి తీసుకెల్లే లోగ తల్లి బిడ్డలకు ప్రమాదమని గమనించిన ఈ ఎంటీ పిల్లి రమేశ్.. పైలెట్ రాజేశం మార్గమధ్యంలో మందమర్రి వద్ద వాహనంలోనే పురుడు పోశారు. మగ బిడ్డకు జన్మనిచ్చినప్పటికి చాలా సేపటి వరకు శిశువులో చలనం లేక పోవడంతో సీపీఆర్ చేశారు. దీంతో శిశువు ఏడ్వటం ప్రారంభించింది. వెంటనే మంచిర్యాలకు తరలించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి బిడ్ధలు క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు. 108 సిబ్బంది పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి
108 లో ప్రసవం




