Monday, 2 November 2026

కదం తొక్కిన సిపిఐ శ్రేణులు – ఎర్రజెండాలతో కళకళలాడిన వీధులు

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 1 (జనంసాక్షి): ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే వేడుకల్లో సిపిఐ శ్రేణులు కదం తొక్కాయి. సోమవారం ఎర్రజెండాలతో హుజూర్ నగర్ పట్టణంలోని వీధులన్నీ కళకళలాడాయి. ప్రధాన రహదారి పై ర్యాలీ నిర్వహించి గాంధీ పార్క్ వద్ద సిపిఐ జెండాను నాయకుడు గుండా రమేష్ ఎగరవేశారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లావుల రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల పండుగ మేడే అన్నారు. ఆనాటి అమరుల స్ఫూర్తితో నేటి కార్మిక వ్యతిరేక బిజెపి ప్రభుత్వంతో పోరాడాలన్నారు. ఐకమత్యంతో ఉద్యమిస్తే సాధించలేనిది ఏది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, కంబాల శ్రీనివాస్, దేవరం మల్లేశ్వరి, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, సీనియర్ నాయకులు కల్వకొలను ప్రసాద్, కొప్పోజు సూర్యనారాయణ, పశ్య వెంకట రెడ్డి, ఎల్లావుల రమేష్, జడ వెంకన్న, సోమగాని కృష్ణ, మామిడి వెంకయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దొంత గాని సత్యనారాయణ, బాదే నరసయ్య పాల్గొన్నారు.