Tuesday, 3 November 2026

టివిఇయు/ హెచ్-82 ఆధ్వర్యంలో ఘనంగా మే డే ను నిర్వహిచిన ఆర్టిజన్ కార్మికులు.   

 

 

 

 

భద్రాద్రికొత్తగూడెంజిల్లాబ్యూరో/పాల్వంచ, మే 1 (జనంసాక్షి):-తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న కేటీపీఎస్ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్) లో మేడే సందర్భంగా హెచ్ 82 ఆధ్వర్యంలో  కేటీపీఎస్ – 5,6వ దశల గేటు ఎదురుగా మేడే కార్మిక జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా ఆర్టిజన్ల చే జెండా ఆవిష్కరింపజేశారు.అనంతరం కార్మిక అమరవీరులకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఎందరో కార్మికుల త్యాగాల ఫలితమే నేడు కార్మికసమాజం అనుభవిస్తున్న స్వేచ్ఛా వాయువులని పేర్కొన్నారు. వారి స్పూర్తి తోనే భవిష్యత్తులో కార్మికలోకం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.