Thursday, 5 November 2026

కనీస వసతుల ను కల్పించండి!

 

 

 

 

 

 

బీజేపీ నేత రఘునాథ్ –గురువారం శ్రీరాంపూర్ డివిజన్ సిహెచ్పి కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ బిఎమ్మెఎస్ నాయకులు పేరం రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గేట్ మీటింగ్ లో మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు కనీస వసతులు ఏర్పాటు చేయడంలో యాజమాన్యం విఫలమైంది అని అన్నారు.మండేటి ఎండలో పనిచేస్తున్న కార్మికులకు వేసవికాలంలో తాగడానికి నీళ్లు, మజ్జిగ వంటి సదుపాయాలు అందించడంలో యాజమాన్యం విఫలం.
సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్మికుల భద్రత పట్టించుకోని యాజమాన్యం.
ప్రశ్నించిన కార్మికులను టార్గెట్ చేసి షిఫ్ట్ లు మార్చడం బదిలీలు చేస్తున్న శ్రీరాంపూర్ సిహెచ్ పి డీజిఎం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని రఘునాథ్ డిమాండ్ చేశారు.