భారతదేశం లో బీజేపీ ని గెలిపించడం అంటే తనని గెలిపించడం అనే అర్దమ్ వచ్చే విధంగా ఏ ఎన్నికల సభల్లో అయినా పీఎం నరేంద్ర మోడీ తనకు ఓటు వేయాలని కోరుతూ ఉంటారు!కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రచారం ఇదే విధంగా కొనసాగింది!హిందుత్వ ఎజెండా తో జరిగింది! తనకు ఓటు వేయాలని కోరారు! 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పుల్వామా,బాలకొట్ సంఘటనలను ముందు పెట్టి ఓటు అడిగిన సంగతి దేశం కు తెలుసు! ఈ సంఘటనలలో పుల్వామా రహస్యాన్ని అప్పటి జమ్మూ – కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మల్లిక్ ఇటీవల బయట పెట్టారు!పీఎం మోడీ తనని నోరు తెరిచి నిజం చెప్పొద్దన్నారని,కుండ బద్దలు కొట్టిన విధంగా వెల్లడించారు! ఇదే ఇతర దేశాల్లో అయితే ఇలాంటి విషయాలు బయటకు వస్తే పీఎం లు రాజీనామాలు చేసే పరిస్థితి ఉంటుంది! కాని మన వద్ద పవర్ ఉన్నోడికి కి నైతికత నిల్! పుల్వామా సంఘటన కన్నా దారుణం మరోటి ఉండదు!ప్రభుత్వ నిర్లక్ష్యం పుల్వామా లో ఆ 40 మంది జవానుల ప్రాణాలు బలిగొంది! ఈ నిజాన్ని సత్యపాల్ మల్లిక్ బయట పెట్టినా,పీఎం సమాధానం ఇవ్వలేదు! అప్పుడు ఈ సంఘటనను పీఎం ఎలా ఉపయోగించుకున్నారో,పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడి,ఓట్ల కోసం,గెలుపు కోసం ఎలా విషయాన్ని వాడుకున్నారో చూసాము! అవసరం ను బట్టి దేశభక్తి నినాదం,మతం,కులం,జాతి,ధరమ్ అంటూ ప్రచారం చేయడం పీఎం,హోమ్ మంత్రి సహా బీజేపీ లోని శ్రేణులు అందరికీ వెన్నతో పెట్టిన విద్య గా పేర్కొనవచ్చు! కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బజరంగ్ దళ్ ను నిషేదిస్తామని చెబితే,దానిని బజరంగ్ బలి కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని,జై బజరంగ్ బలి అంటూ పీఎం సహా బీజేపీ నేతలు అందరూ పల్లవి ని అందుకున్నారు! అయినా జనం ఓడించారు!బీజేపీ ప్రతీ ఎన్నికల్లో ఇలాంటివి తమ స్టేటజీ,ప్లాన్ గా కొనసాగిస్తున్నది! పీఎం జాదూ,మంత్రం,విద్వేశ,అబద్దపు హామీల,సంఘటనల,ఆరోపణల ఉపన్యాసాలు ఎంత కాలం నమ్ముతారు? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగానే నిజానికి కర్ణాటకలోనే 22 రోజులు ఉన్నపుడే,ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు! ఇదే రేపు రాహుల్ యాత్ర జరిపిన ప్రతీ స్టేట్ లో జరుగనున్నది అంటారు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా! వన్ టూ వన్ పోటీ వల్లే కర్ణాటక లో కాంగ్రెస్ కు మంచి మెజారిటీ వచ్చింది! రేపు విపక్షాలు అన్నీ ఒక్కటి అయినా,లీడర్ ఎవరూ,పీఎం అభ్యర్థి ఎవరూ అని పోటీ పడి,ఐక్యతను చెడగొట్టుకోకుండా,ఎవరికీ ఏ రాష్ట్రం లో బలం ఉందో ముందు దాని మీద చర్చించుకుని ఒక జట్టుగా ఏర్పడాలి! స్థానిక విషయాలు,ప్రజల,రాష్ట్ర సమస్యల ఎజెండా తో ఒక ప్రణాళిక ప్రకారం ఎన్నికల్లో పోరాడాలి! ఎలాంటి నువ్వు,నేను లాంటి అహం తో కూడిన వ్యవహారాలకు వెళ్లకుండా ఐక్యత కు కృషి జరగాలి!అనవసరంగా నువ్వా,నేనా అనే వాదనకు వెళ్లి,ఎవరు పెద్ద,అనే విషయాలకు వెళ్లకుండా,ఎనర్జీ ని ఆ విషయాలలో వృధా చేయకుండా,కాస్త బ్రాడ్ గా ఆలోచించాలి! ఎన్నికల తర్వాత లీడర్,పీఎం అభ్యర్థి సంగతి చర్చించు కోవచ్చు!కాంగ్రెస్ మాత్రమే ఈ విపక్షాల ఐక్యతకు కృషి చేయాలి! ఆ మేరకు ఆ పార్టీకే ఆ సత్తా ఉన్న విషయాన్ని అందరూ అంగీకరించాలి! బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం జరుగుతుందని,కొన్ని అవసరమైన, సాధ్యం అయ్యే,షరతులను పెట్టారు!బీహార్ సీఎం నితీష్ కుమార్,అర్జెడి,డిఎంకె,జేఎంఎం,వామపక్షాలు,ఎన్సీపీ,మాజీ సీఎం ఉద్దవ్ టాక్రే లాంటి వారు,పార్టీ లు కాంగ్రెస్ తోనే ఉన్నాయి! మొత్తం దేశంలోని 544 పార్లమెంట్ స్థానాల్లో,మెజారిటీ స్థానాలను గెలుచుకోవచ్చు! బీజేపీ ని,తానే బాహుబలి గా 56 ఇంచుల ఛాతి గల నేతగా చెప్పుకునే పీఎం నరేంద్ర మోడీని ఓడించవచ్చు! ఆయనను కర్ణాటక ఓటర్లు ఓడించారు! అందుకే మోడీ ఎలాంటి కార్డు ను ఉపయోగించినా వారు వినలేదు! పార్లమెంట్ ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోను మోడీకి ఇదే అపజయం లభించబోతుంది! పార్లమెంట్ ఎన్నికల్లోను ఓటమి తప్పదు! అయితే పోటీ వన్ టూ వన్ ఉండాలి! పీపుల్ ఎజెండా ఉండాలి! అలా అయితే ఏ పార్టీ అయినా బీజేపీ’ బి ‘ టీంగా రంగంలో దిగినా బీజేపీ కి ప్రయోజనం ఉండదు,అంటే అతిషయోక్తి కాదు! ఏఎన్నికలు అయినా లోకల్ ఇష్యూ లే ప్రాధాన్యత ను ఇస్తాయి! ఓటర్ల ప్రయారిటీ అలాగే ఉంటుంది! బీజేపీ బలపడింది! వేళ్ళునుకోలేదు!ఆర్ఎస్ఎస్ కు వందేండ్ల తర్వాత వారి వాదన కు ఊతం ఇచ్చే పీఎం నరేంద్ర మోడీ లభించిండు,కాబట్టి ఆయనను ఓడిపోనీయకుండా ఆర్ఎస్ఎస్,విశ్వహిందూ పరిషద్ లు ప్రయత్నాలు,ప్రయాసలు పడుతూ చేస్తాయి!అయితే దేశం ప్రజలు ఇప్పుడు మనిషికి జీవించడానికి అవసరం అయిన విద్యుత్,మంచినీరు,ఉపాధి,అన్నం,ధరల పెరుగుదల,పెరుగుతున్న పేదరికం,అన్నింటికీ మించి సాటి మనిషి సహాయం ఒకరికొకరు అందుకునే,కుల,మతాలకు అతీతమైన,సోదరీ,సోదర భావం గల సమాజం వైపు ప్రజలు ఆలోచించుతున్నారు! విద్వేషాలకు దూరంగా ప్రేమ ను పంచే సమాజం వైపు చూస్తున్నారు! కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో ఇచ్చిన ఈ సందేశాన్ని దేశం ఆమోదిస్తున్నది! అందుకే రాహుల్ బీజేపీ కి టార్గెట్ అయ్యాడు!రాహుల్ సోదరీమణి ప్రియాంకా గాంధీ,ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లు కూడా బీజేపీ కి,మతోన్మాదులకు టార్గెట్ అయ్యారు! దేశంలో కుహనా,మనుషులను విభజించే, రాజకీయాలు చేసి,తద్వారా అధికారం ను కైవశం చేసుకునే ఆలోచనా పరులకు సైతం రాహుల్ అంటే మింగుడు పడదు!రాజకీయాల్లో ప్రత్యర్థి ఎన్ని కుట్రలు,కుహకాలు చేసినా! ప్రజలు ఏది చేయాలని నిర్ణయం తీసుకుంటారో అదే జరుగుతుంది!ఎవరిని ఎలా? ఎప్పుడు మట్టి కరిపించాలో,ఎప్పుడు?ఎలా బుద్ది చెప్పాలో?వారికి తెలుసు!దానినే కాలం నిర్ణయం అంటారు!మదర్ ఆఫ్ డెమోక్రసీ లో ఫాదర్ ఆఫ్ పవర్,అక్రమాలు,అవినీతి,సమస్యలు,దాష్టికాల సంఖ్య పెరిగినపుడు,తమ విలువైన,ఓటు ద్వారా నెత్తిన ఎక్కించుకున్నోళ్ళే నేలకేసి కొడతారు! చివరి ప్రజలు ఆశించేది! కోరుకునేది!జరుగుతుంది!ప్రజా తీర్పు కు మించింది లేదు! ఉండదు! అంటే అతిషయోక్తి కాదు! ————————————————– ఎండి.మునీర్,సీనియర్




