Wednesday, 4 November 2026

కనీస వేతనం పెంచాలని వివోఏల సమ్మె 

 

 

 

 

 

వేమనపల్లి, ఏప్రిల్ 8,(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు దాటిన వీఓఏల బ్రతుకులు ఏమీ మారలేదని వేమనపల్లి వీఓఏ మండల అధ్యక్షుడు జిల్లపల్లి వెంకటి అన్నారు.వీఓఏలకు కేవలం సెర్ప్ నుండి 3900 గౌరవేతనం మాత్రం చెల్లిస్తున్నారని,వీఓఎ లకు కొత్త సర్వేలు చేపిస్తూ పని భారం పెంచుతున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్థాయిలో వీఓఎలు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని,పనికి తగ్గిన గుర్తింపు,తగిన వేతనం గాని ఇవ్వడం లేదని తెలిపారు.రోజురోజుకు పని భారం పెంచుతూ పని భద్రత కల్పించకుండా ఐకెపి వీఓఎ లను ప్రభుత్వం విస్మరిస్తున్నదని,కనీస వేతనం 26,000 వేలు అమలు చేసి,సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వీఓఏలకు సాధారణ ప్రమాద బీమా 10 లక్షలు,హెల్త్ కార్డులు,ఐడెంటి కార్డులు,డ్రెస్ కోడ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమ్మెలో వీఓఏల మండల కార్యదర్శి పోలంపల్లి మధునయ్య,కోశాధికారి రషీద తో పాటు వివిధ గ్రామాల వివోఏలు పాల్గొన్నారు.