Wednesday, 4 November 2026

ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రాకను అరికట్టాలి :చెక్ పోస్టును పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

 

 

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి.ఇతర ప్రాంతాల నుండి వచ్చే ధాన్యం రాకను అరికట్టాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. మిర్యాలగూడ  మండలంలోని ఆలగడప టోల్ గేట్ వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్టును పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకను అరికట్టేందుకు సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం నుండి మఠంపల్లి మీదుగా ధాన్యం లారీలు వచ్చే అవకాశం ఉందని వాటిని రాకుండా అడ్డుకునేందుకు ఆలగడప వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారుల సమన్వయంతో టీములను ఏర్పాటు చేశామని, బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యంలో రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అనిల్ కుమార్  రూరల్ SI నర్సింహులు, సివిల్ సప్లై డిటి రామకృష్ణారెడ్డి, సివిల్ సప్లై ఆర్ఐ సురేందర్ సింగ్, ఆర్ ఐ సత్యనారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.