కన్నకూతురిని కడతేర్చిన కసాయి తండ్రి

బీర్కుర్‌ గ్రామీణం : 14 నెలల కన్నకూతురిని తండ్రే కడతేర్చిన సంఘటన నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలంలోని దుర్కి గ్రామంలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామనికి చెందిన గోపన్‌పల్లి నడిపిగంగారం అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూతురు పుట్టడం ఇష్టలేకపోవడంతో ప్రతిరోజు గంగారం భార్యతో గొడవపడుతున్నాడు. కూతురిని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఈ రోజు ఉదయం కుమారులు చూస్తుండగానే కూతురు మమతను గొంతు నులిమి హత్య చేసాడు. తమ చెల్లెలిని తండ్రే చంపాడని కుమారులు చెప్పడంతో స్థానికులు గంగారంను చెట్లుకు కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు.