హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. లక్ష రూపాయలు ఇవ్వలేదని కన్న తల్లిని కొడుకు దారుణంగా హత్య చేశాడు. విషయం బయటకు తెలియకుండా శవాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కన్నతల్లిని చంపిన కొడుకు




