శంకరపట్నం: జనం సాక్షి మార్చి 27
కరీంనగర్ జిల్లా, మానకొండూర్, నియోజకవర్గం శంకరపట్నం మండలం కన్నాపూర్ ప్రైమరీ పాఠశాలలో సోమవారం ఐసిడిఎస్ అంగన్వాడి ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు, చిన్నారులకు పోషణ ఆహారంపై, పరిశుభ్రతపై, భోజన సమయంలో చేతుల శుభ్రంపై, క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆఫీజా, అంగన్వాడీ టీచర్లు గాజుల కాంత, కాటం రాజమణి, ఆయాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కన్నాపూర్ లో ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ.




