కన్నుల పండుగగా ఆదివరాహ స్వామి కళ్యాణ మహోత్సవం

జనంసాక్షి, కమాన్ పూర్ : వరాలిచ్చే దేవుడు.. పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన స్వామి శ్రీ ఆదివరాహస్వామి..!. ఆ స్వామి అవతరించిన మాసం ఈ పవిత్ర శ్రావణమాసం. మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించే శ్రీ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కమాన్పూర్ మండలమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివరాహస్వామిని దర్శించుకున్నారు. సోమవారం రెండో రోజు ఆదివరాహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ వేద పండితుల వేద మంత్రుత్సవాల మధ్య నిర్వహించారు. పాలకవర్గ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివరాహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.