Thursday, 5 November 2026

కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి

ముథోల్‌ : ఆదిలాబాద్‌ జిల్లా ముథోల్‌ మండలంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదినెలల పసిపాపను కన్నతండ్రే హత్య చేసి పరారయ్యాడు. సీఐ గణపతియాదవ్‌, తల్లి రాణి తెలిపిన వివరాల ప్రకారం.. ముథోల్‌ మండలం వడ్తాల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ముత్తుకు ఐదుగురు ఆడపిల్లలు. సంవత్సరం క్రితం బ’్ఞయంసా పట్టణానికి చెందిన రాణిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా పాప పుట్టడంతో ఇంట్లో వీరిద్దరి మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూతుర్ని విక్రయిద్దామని భార్యతో చెబూతూ వచ్చాడు. అందుకు ఆమె నిరాకరించండంతో కక్ష పెంచుకుని ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న తల్లి హుటాహుటిన శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *