Wednesday, 4 November 2026

కబడ్డీ క్రీడాకారిణికి ఆర్థిక సాయం అందిచిన ఎమ్మెల్యే

 

 

 

 

 

హుజూర్ నగర్ మార్చి 6 (జనం సాక్షి): కబడ్డీ క్రీడాకారిని త్రివేణి జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపిక అయిన సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమెను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. అనంతరం నేపాల్ దేశంలో అంతర్జాతీయ కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఎంపికైన త్రివేణికి 25000/-ఆర్థిక సహాయం అందచేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.