ఫొటో : మాడల్ పేపర్లు పంపిణీ చేస్తున్న నాయకులు.బెల్లంపల్లి, మార్చ్ 6, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మజ్లిస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మజ్లిస్-ఎ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ ఆధ్వర్యంలో “సాలార్ మిల్లత్ ఆల్ ఇన్ వన్ మోడల్ పేపర్” పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎఐఎంఐఎం హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ హాజరయ్యారు. బెల్లంపల్లి మజ్లిస్ అధ్యక్షుడు ముహమ్మద్ ఇమ్రోజ్, ప్రధాన కార్యదర్శి జకీర్, కార్యకర్తలు ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. విద్యార్తులకు మాడల్ పేపర్ల పంపిణీ
అనంతరం ఆయన మాట్లాడుతూ మజ్లిస్ విద్యారంగంతో పాటు ప్రతి రంగంలో ప్రజల సంక్షేమం కోసం చురుగ్గా పనిచేస్తుందన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రజల్లో ఉంటు ప్రజల కోసం పని చేస్తూ పార్టీని బలపరచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మజ్లిస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు అఫ్జల్ రజ్వి, ఇంతియాజ్, ముస్తకహిమ్, షారుక్, సాజిద్ బాబా, షారుక్, అసిఫ్, అక్బర్, ఖాజా, సల్మాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బందితో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




