Tuesday, 3 November 2026

కమాన్ పూర్  మండలానికి రూ. 1. 52 కోట్ల నిధులు మంజూరు

కమాన్ పూర్  మండలానికి రూ. 1. 52 కోట్ల నిధులు మంజూరు- జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు  ప్రత్యేక చొరవతో మంజూరు
పెద్దపెల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిధిలోని కమాన్ పూర్ మండలం పంచాయతీ రాజ్ శాఖ నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కమాన్ పూర్ మండలంలోని నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించిన ప్రతిపాదనలు పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్  పంపగా కమాన్ పూర్  మండలానికి రూ.1.58 కోట్ల నిధులు మంజూరైనట్లు బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు  పి. కిషన్ రెడ్డి తెలిపారు. కమాన్ పూర్  75 లక్షలు, జూలపల్లి 12 లక్షల 50 వేలు, సిద్ధిపల్లి 10 లక్షలు, పెంచికల్ పేట్ 30 లక్షలు, నాగరం 5 లక్షలు, రొంపికుంట 5 లక్షలు, పేరపల్లి 5 లక్షలు, గొల్లపల్లి 5 లక్షలు, గుండారం 5 లక్షలు మొత్తం ఒక కోటి యాభై రెండు లక్షల యాభై వేలు  మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కమాన్ పూర్ మండలానికి ఒక కోటి 52 లక్షల 50 వేల నిధులు మంజూరు చేసిన  పంచాయతీ రాజ్  శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కి, నిధుల మంజూరుకు కృషి చేసిన పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కి , కమాన్ పూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు.