Wednesday, 4 November 2026

కమాన్ పూర్ మండలాన్ని మూడు ముక్కలు చేసిన ఘనత పుట్ట మధుకే దక్కుతుంది..! – విలేకరుల సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ వైనాల రాజు

 

 

 

 

 

 

జనం సాక్షి , కమాన్ పూర్ : మంథని నియోజక వర్గం లోనే అతిపెద్ద మండలం అయిన కమాన్ పూర్ మండలాన్ని మూడు ముక్కలు చేసింది ఎవరో మండల ప్రజలకు తెలుసునని, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కమాన్ పూర్ మండలాన్ని మూడు ముక్కలుగా చేసి అతి చిన్న మండలంగా మార్చారని కిసాన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ వైనాల రాజు ఆరోపించారు. గురువారం జూలపల్లి లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో మీ టిఆర్ఎస్ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది.. మరి అలాంటప్పుడు కమాన్పూర్ మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎందుకు అద్దె భవనంలో నడుస్తుంది..?, కమాన్పూర్ మండలంలోని గ్రామపంచాయతీ భవనం ఎందుకు డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక వద్ద ఎన్టిపిసి సిఎస్ఆర్ వాళ్లు కట్టిన కమ్యూనిటీ హాల్లో ఎందుకు నడుస్తున్నది సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జేఎన్టీయూలో బహుజన బిడ్డల ఉద్యోగాల తొలగింపు చేసి డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. కమాన్ పూర్ నుండి జూలపల్లి ఆదర్శనగర్ వరకు రోడ్డు వెడల్పు చేశాను అని వాల్ పోస్టర్ లో చెప్పుకుంటున్నావు కదా పుట్ట మధు.. మా జూలపల్లిలోని గోడల శిథిలాల దగ్గరికి వెళ్లి అడుగు … ఆ శిథిలాల వెనుక జూలపల్లి సర్పంచ్ గా తన భార్య వైనాల అనిత రాజు పడిన కష్టం, జైలుకెళ్ళిన విషయం తెలుస్తుంది అని అన్నారు. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశామని చెప్పుకుంటున్నారని.. రైతుల వద్ద నుండి క్వింటాలుకు 7 కిలోలు రైస్ మిల్లర్లు కట్ చేసిన ధాన్యం నుంచి ఆ బియ్యం ఉచితంగా క్విడ్ ప్రోకో రూపంలో మధ్యాహ్నం భోజనానికి వచ్చాయని ఆరోపించారు. కమాన్పూర్ మండలంలో కమాన్పూర్ గుండారం సబ్స్టేషన్లు నిర్మించిన ఘనత శ్రీధర్ బాబుది అని, ప్రతి గ్రామంలో రోడ్లు మౌలిక వసతుల కల్పన, శ్రీపాద ఎల్లంపల్లి నిర్మించి అక్కడ నుంచి 2 టిఎంసి గుండారంకు తరలించి కమాన్పూర్ రామగిరి మంథని ముత్తారం మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు నీరు అందించిన ఘనత తమ నాయకుడిదే అని అన్నారు. ప్రతి ఊరిలో సొంత ఇంటి నిర్మాణం కై ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన ఘనత మా నాయకుడిది అని అన్నారు. కమాన్పూర్ మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అయినా నిరుపేదకు కట్టించారు అని ప్రశ్నించారు. గుండారం కాలేజీ మంజూరు చేసింది శ్రీధర్ బాబు అని, దళిత బహుజన ఆత్మగౌరవ సూచికైన అంబేద్కర్ విగ్రహంలో తమ నాయకుడి పాత్రను అంబేద్కర్ విగ్రహ కమిటీ నీ అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి రాజయ్య, ఎంపిటిసి శేవ్వ శంకరయ్య , రామగిరి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శివ, పెండ్యాల రాజు, బొజ్జ సతీష్ , అబ్బేంగుల కొమురయ్య, జంగిలి కుమార్, తిరుపతి, చిక్కుల శీను, బండి లక్ష్మణ్ , కుక్క రవి, పోతుల కుమార్ , బిల్ల కృష్ణ, కొమ్ము రాయమల్లు, కుమ్మరి రాజు, కుమ్మరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.