Wednesday, 4 November 2026

అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వార్డు సభల ద్వారా తీసుకున్న సమాచారాన్ని సాయంత్రం లోగా సబ్మిట్ చేయాలి

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 5 (జనం సాక్షి);అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వార్డు సభలు ద్వారా తీసుకున్న సమాచారాన్ని  ఎక్సెల్ ఫార్మాట్ లో సాయంత్రం వరకు సబ్మిట్ చేయాలనీ జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ అధికారులను ఆదేశించారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సమావేశ హాలు లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక లో వార్డు సభలు నిర్వహించి తీసుకున్న సమాచారంను  ఎక్సెల్ ఫార్మాట్ లో  మెయిల్ ద్వారా పంపించాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు తీసుకున్న సమాచారంలో పొరపాట్లు జరుగకుండా పూర్తి స్తాయి సమాచారం ఉండాలని తెలిపారు. ఎస్సి అయి వుండి  వికలాంగుడు గా ఉంటే అర్హుడిగా గుర్తిస్తు పర్మ్యాట్ లో తప్పని సరిగా ఫిలప్ చేయాలనీ , ఎస్సి, ఎస్టి, పి డబ్ల్యు డి , ఎక్ష్స సర్వీసు మెన్ వారికీ రిజర్వేషన్ ఉంటుందని , ప్యార్మాట్ లోని రిమార్కుల కాలం లో  తీసుకున్న సమాచారాన్ని అంతా ఫిలప్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు.సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.