Wednesday, 4 November 2026

కమాన్ పూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ నీలం సరిత శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం శైలజ శాంతి , సీసీలు శ్రీనివాస్, రాజ్య లక్ష్మి , ఏవో ప్రమోద్ కుమార్, ఏఈవో శ్రీనివాస్ , మహిళా సంఘం సభ్యులు, హమాలీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.